13వ తేదీన పాడేరులో నిర్వహించే పేసా అవగాహన సదస్సుకు హాజరు కావాలి
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 7: పాడేరు ఐటిడిఏ కేంద్రంలో ఈ నెల 13న నిర్వహించనున్న పేసా గ్రామసభల అవగాహన సదస్సుకు జీకే వీధి మండలంలోని అన్ని గ్రామపంచాయతీల పేసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని మండల పేసా అధ్యక్షులు కొర్ర బలరాం, ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబు కోరారు. పేసా చట్టం అమలు, గ్రామసభల అధికారాలు, స్థానిక పరిపాలనలో గ్రామసభల పాత్ర, కమిటీల విధి విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి...