అర్ధరాత్రి అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన మంత్రి సుభాష్

ద్రాక్షారామం, పెన్ పవర్ జూన్ 26: ద్రాక్షారామంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం పలువురు వ్యాపార కుటుంబాల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించగా, పలువురు వ్యాపారులు తమ జీవనాధారాన్ని కోల్పోయారు.ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అర్ధరాత్రి వేళలోనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నికి ఆహుతైన దుకాణాలను పరిశీలించిన మంత్రి,...