ఆపదలో అండగా డేగల నాగేంద్ర.. అగ్నిప్రమాద బాధితులకు
కాజులూరు, పెన్ పవర్, జూన్ 26: ద్రాక్షారామంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం పలువురు కూరగాయల వ్యాపారుల జీవితాల్లో విషాదాన్ని నింపింది. సుమారు 30 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతై, లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో పలువురు వ్యాపారులు ఒక్కసారిగా జీవనాధారాన్ని కోల్పోయారు.ఈ విషాద ఘటనపై స్పందించిన డీఎన్‌ఎఫ్ సంస్థ అధినేత, జనసేన పార్టీ యువనేత డేగల నాగేంద్ర బాధితులకు మానవీయ కోణంలో అండగా నిలిచారు.అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ద్రాక్షారామ కూరగాయల మార్కెట్ పునర్నిర్మాణం కోసం తన...