ఆర్యవటంలో భక్తి వెల్లువ.. సీతారామ సమేత లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహాల వైభవ ఊరేగింపు
24న పునఃప్రతిష్ఠ మహోత్సవం.. భక్తులందరికీ ఆలయ నిర్వాహకుల ఆహ్వానం కాజులూరు, పెన్ పవర్, జూన్ 21: కాజులూరు మండలంలోని ఆర్యవటం గ్రామం ఆదివారం సాయంత్రం భక్తి పారవశ్యంతో మార్మోగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయస్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా స్వామివారి విగ్రహాలను గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రామ ప్రజలను భక్తి భావంలో ముంచెత్తింది. గ్రామానికి చెందిన దాత సనపల ధనరాజు ఆధ్వర్యంలో, తన తల్లిదండ్రులు...