ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు శ్రీకారం
గంగవరం, జూన్ 13 (పెన్ పవర్): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గంగవరం మండలంలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్, అసిస్టెంట్ ఓటర్ల నమోదు అధికారి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 37 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలు పరిశీలించి చేర్పులు, తొలగింపులు, సవరణలు చేపడతారని పేర్కొన్నారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు...