కాలువల అభివృద్ధితో రైతాంగానికి ఊరట

  పెడన, పెన్ పవర్, జూన్ 13 బంటుమిల్లి మండలం డీసీ పరిధిలోని పంట కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి రైతుల ప్రశంసలు అందుకుంటున్నారు డీసీ చైర్మన్ బొర్రా కాశీ. రైతులకు సాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరేలా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. పంట కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క, తూడు, నాచు మొక్కలను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.కాలువల్లో కలుపు మొక్కలు విస్తరించకుండా కలుపు మందును పిచికారీ చేయిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగిస్తున్నారు.కాలువల...