కృష్ణదేవిపేటలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

పాల్గొన్న కలెక్టర్ విజయ్ కృష్ణన్ నర్సీపట్నం, పెన్ పవర్ : గొలుగొండ మండలం కృష్ణదేవిపేట, అల్లూరి సీతారామరాజు ఉద్యానవనంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో పాటు నాలుగు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకుడు సూర్యచంద్ర మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం...