కేజీహెచ్‌లో గాయపడిన బాధితులను పరామర్శించిన డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 4: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలానికి చెందిన పలువురు బాధితులను ఆంధ్ర వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు గురువారం పరామర్శించారు. మండలంలోని ఎర్రవరం గ్రామానికి చెందిన కొర్ర బాబూరావు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండగా, గైనిక్ వార్డులో చికిత్స పొందుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన కొర్ర వెంకటలక్ష్మిని, అలాగే శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న ఎర్రవరం గ్రామానికి చెందిన తాడి...