కొలువుదీరిన అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం

ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్: ​అనకాపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్  చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడిగా కర్రి భాస్కరరావు, కార్యదర్శిగా చెన్నా మూర్తి, కోశాధికారిగా పెదపాటి రాజా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి.వి.ఎస్ ప్రసాద్,...