గూడ్స్ వెహికల్‌లో ప్రయాణిస్తే సీజ్ తప్పదు. చింతూరు ఎస్‌ఐ
గూడ్స్ వాహనంలో 25 మంది కూలీల ప్రయాణం. రూ.19 వేల జరిమానా విధింపు చింతూరు, పెన్ పవర్, జూన్ 7: చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బొలెరో గూడ్స్ వాహనంలో 25 మంది కూలీలను తరలిస్తుండగా చింతూరు పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు. చింతూరు ఎస్‌ఐ వాహన తనిఖీల సమయంలో గూడ్స్ వాహనంలో అధిక సంఖ్యలో కూలీలు ప్రయాణిస్తున్నట్లు గుర్తించి చెక్ రిపోర్ట్ సిద్ధం చేసి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించారు. అనంతరం సంబంధిత వాహనంపై రూ.19 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా...