ఘనంగా మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు.. శుభాకాంక్షల వెల్లువ సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకం రామచంద్రపురం, పెన్ పవర్,జూన్ 17: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు బుధవారం రామచంద్రపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డులోని విజయ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుష్పగుచ్ఛాలు అందజేసి, కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సభా ప్రాంగణం అంతా శుభాకాంక్షల సందేశాలు,...