జనసేన రాష్ట్ర సేనదళం కమిటీలో డాక్టర్ వంపూరు గంగులయ్యకు బాధ్యతలు హర్షనీయం
గూడెం కొత్తవీధి జనసైనికుల్లో హర్షాతిరేకం గూడెం కొత్త వీధి, పెన్ పవర్,జూన్ 4: జనసేన పార్టీ రాష్ట్ర సేనదళం కమిటీలో పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. వంపూరు గంగులయ్యకు బాధ్యతలు అప్పగించడంపై జీకే వీధి మండల జనసేన నాయకులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ, పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న డా. గంగులయ్యకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని...