దుగ్గుదూరులో డయేరియా కలకలం..

కలుషిత ఆహారమే కారణమని ప్రాథమిక నిర్ధారణ, 32 మందికి చికిత్స కాజులూరు, పెన్ పవర్, జూన్ 28: కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో నమోదైన డయేరియా కేసులకు కలుషిత ఆహారం కారణమై ఉండవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. స్థానిక వీధి వ్యాపారి విక్రయించిన బజ్జీలు, పునుగులు తినడం వల్ల ఆహార విషబాధకు గురై ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.నివేదిక ప్రకారం, జూన్ 27 నాటికి గ్రామంలో మొత్తం...