నర్సీపట్నంలో సురభి వారి పౌరాణిక నాటక ప్రదర్శనలు

నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జూన్ 14, 15 తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అపూర్వమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చొరవతో సుప్రసిద్ధ శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) వారిచే భారీ పౌరాణిక నాటక ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్పీకర్ పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమంలో జూన్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు 'మాయాబజార్' నాటకాన్ని, 15వ...