పండుగ వాతావరణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ
మండల వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరిన పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరింపు కాజులూరు, జూన్ 1 (పెన్ పవర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సోమవారం కాజులూరు మండల వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. గొల్లపాలెం, శలపాక, బంధనపూడి, ఆర్యావటం తదితర గ్రామాల్లో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వం ప్రతి...