పేసా చట్టం… గిరిజన స్వయం పాలనకు రాజ్యాంగ రక్షణ
గ్రామసభకు అధికారం... గిరిజనుల హక్కులకు భరోసా స్టాప్ రిపోర్టర్.గూడెం కొత్త వీధి, జూన్ 20:దేశంలోని గిరిజనుల హక్కుల పరిరక్షణ, వారి సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ, సహజ వనరులపై నియంత్రణ కల్పించేందుకు రూపొందించిన అత్యంత కీలకమైన చట్టాలలో పేసా చట్టం ఒకటి. షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే గిరిజనులకు స్వయం పాలన హక్కును కల్పించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించినప్పటికీ, గిరిజన ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 1996లో పంచాయతీరాజ్ వ్యవస్థను...