పోలియో నిర్మూలన మనందరి లక్ష్యం: జనసేన నాయకుడు గబులంగి గణేష్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 27:పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జనసేన పార్టీ రింతాడా పంచాయతీ ప్రధాన కార్యదర్శి గబుళంగి గణేష్ ఒక ప్రకటనలో కోరారు.భారతదేశం పోలియో రహిత దేశంగా నిలిచినప్పటికీ,ఆ స్థితిని కొనసాగించేందుకు నిరంతర ప్రయత్నాలు అవసరమని ఆయన తెలిపారు.ప్రతి ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారికి పోలియో చుక్కలు వేయడం ద్వారా మాత్రమే పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పోలియో నిర్మూలన కోసం కుటుంబ...