ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గొలుగొండ, పెన్ పవర్ : అమలు కాని హామీలతో గత ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి రెండేళ్లయిన వాటిని అమలు చేయకపోగా, కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. మంగళవారం గొలుగొండలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతల మోసాన్ని గ్రామ గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12న నర్సీపట్నంలో తలపెట్టిన నిరసన...