ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తాడలో అవగాహన కార్యక్రమం
మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు అధికారులు గంగవరం, పెన్ పవర్, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగవరం మండలంలోని కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వక్తలు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మొక్కలు నాటడంతో...