బోలెరో వాహనం బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు
చింతూరు, పెన్ పవర్, జూన్ 5: మారేడుమిల్లి, చింతూరు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోలెరో వాహనం బోల్తా పడడంతో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, జి. మేడపాడు, గంటి పెద్దాపురం, జగంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది వివాహ కార్యక్రమానికి హాజరై చింతూరు వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో...