మన్యంలో మళ్లీ బాక్సైట్ భూతం..!, “జర్రెల కొండల్లో కలకలం”,
"సర్వే బృందాన్ని నిలదీసిన గిరిజనులు" ## బాక్సైట్ శాంపిళ్ల స్వాధీనం.. అధికారుల విచారణకు డిమాండ్ గూడెం కొత్త వీధి, జూన్ 18 (పెన్ పవర్): అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జర్రెల బ్లాక్‌లో బాక్సైట్ అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. గతంలో గిరిజనుల తీవ్ర వ్యతిరేకతతో బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనలు నిలిచిపోయిన నేపథ్యంలో, తాజాగా బాక్సైట్ శాంపిళ్ల సేకరణ, సర్వే కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.స్థానికుల సమాచారం మేరకు ఓ కంపెనీకి చెందిన సర్వే బృందం జర్రెల బ్లాక్...