మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

చింతూరు, పెన్ పవర్, జూన్ 13: మహిళలపై జరుగుతున్న మోసాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్ సూచించారు. చింతూరు మండలంలోని చట్టి జంక్షన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువత మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా...