మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం:టీడీపీ మండల బాడీ సమావేశంలో తీర్మానాలు

గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 10:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం గూడెంకొత్తవీధి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల బాడీ సమావేశం బుధవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై తీర్మానాలు చేశారు.మండలంలోని 16 పంచాయతీల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి వసతులు, చెక్‌డ్యాంల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల...