లాటరైట్ మైనింగ్‌కు పేసా గ్రామసభ వ్యతిరేక తీర్మానం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 02: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస గ్రామపంచాయతీ పరిధిలోని డోకులూరు దానులవీధిలో నిర్వహించిన రంపుల పెసా గ్రామసభలో లాటరైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెసా ఉపాధ్యక్షులు కొర్రా బాలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెసా కార్యదర్శి గెమ్మెల దొరబాబు అజెండాను చదివి వినిపించారు.డోకులూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 01(పి)లో 11.370 హెక్టార్ల భూమిలో రూ.100 లక్షల వ్యయంతో బుక్క రాజేంద్రప్రసాద్‌కు మంజూరు చేసిన లాటరైట్ ఖనిజ తవ్వకాల...