శిథిలావస్థలో అంగన్వాడి భవనాలు:నూతన భవనాల మంజూరుకు పీజీఆర్‌ఎస్‌లో వినతి
టీడీపీ నాయకుడు చెండా బాబుజి ముంచంగిపుట్టు, పెన్ పవర్, జూన్ 10:మండలంలోని మాకవరం పంచాయతీ పరిధిలో ఉన్న కుంభీరిపడ తదితర గ్రామాల్లో అంగన్వాడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానాల్లో నూతన భవనాలు మంజూరు చేయాలని టీడీపీ నాయకుడు చెండా బాబుజి కోరారు. బుధవారం ముంచంగిపుట్టు కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఆయన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చెండా బాబుజి మాట్లాడుతూ మాకవరం పంచాయతీ పరిధిలోని కుంభీరిపడ గ్రామ అంగన్వాడి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియని...