శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి క్రికెట్ టోర్నీ విజేతగా ముంచంగిపుట్టు

ముంచంగిపుట్టు,పెన్ పవర్,జూన్‌ 2: మండలంలో ఉత్సాహంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా జరిగిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ముంచంగిపుట్టు క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) విజేతగా నిలిచింది. సుజనకోట పంచాయతీ పరిధిలోని సుజనపేట గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంచంగిపుట్టు జట్టు, బీట గ్రామ జట్టు మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి ముంచంగిపుట్టు జట్టు అద్భుత ఆటతీరుతో బీట జట్టుపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొని క్రీడాస్ఫూర్తిని...