సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట స్థానం
వీరప్పదొర పదవీ విరమణ సన్మాన సభలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు గంగవరం, పెన్ పవర్, జూన్ 7: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని, ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైన సేవా వృత్తిగా నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి (ఏజెన్సీ) వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని పెద్దగార్లపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కోసు వీరప్పదొర పదవీ విరమణ సందర్భంగా ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.దేవీపట్నం మండలం పోతవరం సంక్షేమ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ...