సీజనల్ వ్యాధులపై అప్రమత్తం కావాలి:వైద్య శిబిరాల్లో ఆరోగ్య అవగాహన

👉ఆర్వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజీ వినీతాంజలి గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్.వి.నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం పనసపల్లి, బోనంగిపల్లి, బందపాలెం, మూలగరువు, నూతి బంధ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రోజీ వినీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ రోజీ...