స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి
మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ నర్సీపట్నం, పెన్ పవర్ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సోమవారం జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. అనకాపల్లిజిల్లా నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఘోర దుర్ఘటన జరిగి 8 మంది సంఘటన స్థలంలోనే మరణించారని, మరికొందరు క్షతగాత్రులు అయ్యారని ఇప్పుడే సమాచారం వచ్చిందని, ఇటువంటి సంఘటనలు బాధాకరమన్నారు....