రాజంపాలెంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

    గంగవరం, పెన్ పవర్, జూన్ 17: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం ఆముదాలబంధ పంచాయతీ పరిధిలోని రాజంపాలెం గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాలకే వైద్య సేవలను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.గంగవరం మండలంలో...