నెల్లిపూడిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

    గంగవరం, పెన్ పవర్, జూన్ 23: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.నెల్లిపూడిలో నిర్వహించిన శిబిరంలో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో...