యోగాతో ఆరోగ్యకర జీవనం సాధ్యం: కలెక్టర్ దినేష్ కుమార్
రంపచోడవరం, జూన్ 20 (పెన్ పవర్): ప్రతిరోజూ 45 నిమిషాల పాటు యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరంలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవితో కలిసి ప్రారంభించారు. యోగా భారతదేశ వారసత్వ సంపదగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్...