ఢిల్లీ సంకేతాలు.. టీడీపీకి మరింత ప్రాధాన్యమా?
స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, జూన్ 12 : కేంద్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల మధ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార పక్షం తెలుగుదేశం పార్టీ మళ్లీ జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి అదనపు ప్రాధాన్యం కల్పించే అంశంపై ఢిల్లీలో మంతనాలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పర్యటనలో కేంద్రంలోని కీలక నాయకులతో భేటీ కావడం, అనంతరం వెలుగులోకి వచ్చిన రాజకీయ సంకేతాలు ఆసక్తిని...