క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్ దినేష్ కుమార్
రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 25: పోలవరం జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిజికల్ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 12 మండలాల్లో యువతకు క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, బంజరు, గ్రామకంఠం భూములను క్రీడా మైదానాల కోసం గుర్తిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 50 స్పోర్ట్స్ గ్రౌండ్లు గుర్తించినట్లు వెల్లడించారు. గ్రామాల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి యువతకు క్రీడా సామగ్రి అందజేసి,...