పల్స్ పోలియో బూత్‌ల కుదింపును వెంటనే ఉపసంహరించుకోవాలి
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉపసంహరించుకోకపోతే బహిష్కరిస్తాం : సీఐటీయూ డిమాండ్ రంపచోడవరం, జూన్ 27 (పెన్ పవర్): పోలవరం జిల్లాలో పల్స్ పోలియో బూత్‌ల సంఖ్యను తగ్గించడం గిరిజన ప్రాంతాల చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల మధ్య ఎక్కువ దూరం, రవాణా సౌకర్యాల లేమి కారణంగా తల్లులు పిల్లలను బూత్‌లకు తీసుకురావడం కష్టమవుతుందని, దీంతో అనేక మంది చిన్నారులు పోలియో చుక్కలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. బూత్‌ల...