కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత?

కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత? వరుస ప్రమాదాలతో కార్మికుల భద్రతపై ఆందోళన విశాఖ, పెన్ పవర్,జూన్ 11 : “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు వరుస ప్రమాదాలతో విషాదానికి కేంద్రంగా మారుతోంది. ఎంతో పరిజ్ఞానం, అనుభవంతో నిర్మించిన ఈ కర్మాగారంలో భద్రతా లోపాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపో తున్నాయని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఎంఎస్-2 ప్రారంభ సమయంలో జరిగిన ప్రమాదాల నుంచి ఇటీవల...