ఆదివాసీ హక్కులపై ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి: డీఎల్ఓ విమర్శ
మంత్రుల సమావేశాన్ని బహిష్కరించే ఆలోచనలో దండకారణ్య విమోచన సమితి గూడెం కొత్త వీధి, పెన్ పవర్, జూలై 27: ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాయని దండకారణ్య విమోచన సమితి (డీఎల్ఓ) రాష్ట్ర అధ్యక్షుడు కోర్రా మార్క్ రాజు విమర్శించారు. ప్రజా సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా ఇప్పటివరకు ఎలాంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు.ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకాలకు కీలకమైన జీవో నెం.3ను సుప్రీంకోర్టు 2020లో రద్దు చేసిన అనంతరం అప్పటి...