ఇచ్చిన హామీలు అమలు చేయాలి – అరకు మహాగర్జనకు వాలంటీర్ల పిలుపు

భారీగా తరలిరావాలని జీకే వీధి మండల నాయకుల విజ్ఞప్తి గూడెం కొత్తవీధి, పెన్ పవర్, జూలై 10: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలిలో ఈ నెల 14వ తేదీ (మంగళవారం) నిర్వహించనున్న వాలంటీర్ల మహాగర్జనకు జీకే వీధి మండల పరిధిలోని 16 పంచాయతీల వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరుకావాలని మండల వాలంటీర్ల నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం జీకే వీధిలో నిర్వహించిన సమావేశంలో మండల వాలంటీర్ల అధ్యక్షుడు గెమ్మెల కోటి, ఉపాధ్యక్షుడు డి. మురళీమోహన్, కార్యదర్శి పి. భాస్కర్ రావు మాట్లాడారు.రాజీనామా చేసిన వారు, చేయని వారు...