ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి:జూలై 14న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ
ఉపాధ్యాయ సంఘాల నేతల పిలుపు గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే రాష్ట్రవ్యాప్త "రైట్ ఫర్ టీచింగ్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించడం, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించడం, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు...