ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి చెక్..!గైర్హాజరైన అధికారులపై సస్పెన్షన్ వేటు

జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎవరినీ ఉపేక్షించం: కలెక్టర్ నిషాంతి. టి స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జూలై 6: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంతి.టి హెచ్చరించారు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలో విధులకు గైర్హాజరైన ఒక పంచాయతీ కార్యదర్శి, బూత్ లెవెల్ అధికారి (BLO)గా విధులు నిర్వహిస్తూ బాధ్యతలను విస్మరించిన ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ చర్యలు చేపట్టినట్లు సోమవారం కలెక్టరేట్ నుంచి...