ఎస్‌ఐఆర్ సర్వేలో ఒక్క ఓటరూ మిస్ కాకూడదు- బీఎల్‌ఓలకు బీఎల్‌ఏలు సహకరించాలి: బొబ్బిలి లక్ష్మణ్

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 7:ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఓటరికి అందేలా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు)కు వైఎస్సార్‌సీపీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పూర్తి సహకారం అందించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ కోరారు. మంగళవారం గూడెం కొత్తవీధి మండలంలో ఆయన మాట్లాడుతూ, మండలంలో మొత్తం 56 పోలింగ్ బూత్‌లు ఉండగా, అన్ని బూత్‌లకు పార్టీ తరఫున బీఎల్‌ఏలను నియమించామని తెలిపారు. ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని బీఎల్‌ఓతో...