కళాకారులు తమ ఆటపాటల తో ప్రజల్లో నూతన చైతన్యాన్ని నింపాలి
గార్ల, పెన్ పవర్, జులై 28: గార్ల మండల కేంద్రంలో ప్రజానాట్యమండలి రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభ సభ ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి నక్క సైదులు అధ్యక్షతన జరిగింది ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతరక విధానాలను ప్రజల్లోకి తీసుకపోవడంలో ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని...