కోవత్తులతో సిపిఐ నాయకుల నిరసన

గార్ల, పెన్ పవర్, జులై 27: నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పట్ల విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు...