గంజాయికి ‘నో’ చెప్పండి.. సైబర్ మోసాలకు చెక్ పెట్టండి:మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి – ఎస్సై సురేష్
అవగాహనతోనే గంజాయి, సైబర్ నేరాలకు అడ్డుకట్ట సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 9: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటేనే సమాజాన్ని సురక్షితంగా ఉంచగలమని గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం...