గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి

ఎల్బీనగర్, పెన్ పవర్ జులై 24 : సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాలని సామాజిక కార్యకర్త కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పెన్ పవర్ ప్రతినిధితో మాట్లాడారు. గంజాయి వినియోగం వల్ల ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతిఒక్కరూ అవగాహన కల్పించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు...