గంజాయి రవాణాదారులపై రూరల్ పోలీసుల కఠిన చర్యలు : పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద నిందితుడి అరెస్ట్

చిలకలూరిపేట , పెన్ పవర్, జూలై 16: చిలకలూరిపేట: గంజాయి రవాణాపై పల్నాడు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు నేతృత్వంలోని బృందం అక్రమ రవాణాదారులపై నిఘా తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో, రెండు అంతకంటే ఎక్కువ కేసులు నమోదై సమాజానికి ముప్పుగా మారిన ముఠా సభ్యులను గుర్తించి, పీఐటీ ఎన్డీపీఎస్ (PIT NDPS Act - 1988) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటోంది....