గొల్లపాలెం రక్షిత మంచినీటి పథకం స్తంభింపు
20 గ్రామాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం అధికారుల నిర్లక్ష్యమా నిర్వహణ లోపమా? ప్రజల్లో ఆగ్రహం కాజులూరు, పెన్ పవర్ జూలై 10: కాజులూరు మండల ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని గొల్లపాలెం రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అయ్యే తాగునీరు దాదాపు 20 రోజులుగా నిలిచిపోవడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన కొలాయి ట్యాంకులు, రక్షిత మంచినీటి సరఫరా...