గొల్లపాలెం సీపీడబ్ల్యూఎస్ చెరువు వేలం హఠాత్తుగా నిలిపివేతపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు
డిపాజిట్‌లు తీసుకుని పాట రద్దు చేయడం అన్యాయం డిపాజిట్‌దారుల ఆవేదన కాకినాడ, పెన్ పవర్, జూలై 13: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ సీపీడబ్ల్యూఎస్ చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపల బహిరంగ వేలాన్ని హఠాత్తుగా నిలిపివేయడంపై జిల్లా కలెక్టర్‌కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వీరవల్లి గణపతి సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. గొల్లపాలెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చెరువులోని చేపల వేట హక్కులను బహిరంగ వేలం ద్వారా కేటాయించేందుకు గ్రామంలో చాటింపు వేయడంతో పాటు అధికారిక ప్రకటన విడుదల...