గోదావరిలో ఐదుగురు మృతి. ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
గోదావరిలో విషాదం. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి చింతూరు, పెన్ పవర్, జూలై 18: పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం నదిలోకి వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ వి. కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు...