ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
గార్ల, పెన్ పవర్, జూలై 25: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజును పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలో స్థానిక మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం ఎంపిటిసి శీలంశెట్టి రమేష్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామికి అర్చన పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి రమేష్...